ఈబీసీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

Rajya Sabha Possess Ten Percent Quota For EBC - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ ప్రవేశపెట్టిన బిల్లు బుధవారం రాజ్యసభలో ఆమోదం పొందింది. బిల్లుకు అనుకూలంగా  149 ఓట్లు వచ్చాయి. బిల్లుకు వ్యతిరేకంగా  7 ఓట్లు పడ్డాయి. ఓటింగ్ సమయంలో రాజ్యసభలో 156 మంది సభ్యులున్నారు. బిల్లుకు దాదాపు అన్ని పార్టీలూ మద్దతు తెలిపాయి. విద్య, ఉద్యోగాల్లో అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించే ఈ బిల్లుకు మంగళవారం లోక్‌సభ ఆమోదం తెలిపిన సంగతి తెల్సిందే. నేడు రాజ్యసభలో కూడా ఆమోదం పొందడంతో బిల్లును రాష్ట్రపతి సంతకం కోసం పంపించనున్నారు. రాష్ట్రపతి సంతకం తర్వాత బిల్లు అమల్లోకి వస్తుంది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top