
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యుడిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన అనంతరం సోమవారం పార్లమెంట్ తొలిసారి సమావేశమైన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా కొత్తగా ఎన్నికైన సభ్యులు పదవీ స్వీకారం ప్రమాణం చేశారు. లోక్‌సభలో రాహుల్ పేరు ప్రకటించగానే కాంగ్రెస్ సభ్యులు పెద్ద ఎత్తున బల్లలు చరిచి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమయంలో సోనియా గాంధీ కూడా సభలోనే ఉన్నారు. కాగా సిట్టింగ్ స్థానం అమేథి, కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేసిన రాహుల్.. వయనాడులో మాత్రమే గెలుపొందిన విషయం తెలిసిందే. ‘‘వరుసగా నాలుగోసారి లోక్‌సభకు ఎన్నికయినందుకు సంతోషంగా ఉంది. ఎంపీగా నాపై ఉన్న బాధ్యతలను నెరవేరుస్తా. రాజ్యాంగం స్ఫూర్తిగా ప్రజల హక్కుల కోసం పనిచేస్తా’’ అంటూ తన ట్విటర్ ద్వారా రాహుల్ వెల్లడించారు.