
తిరువనంతపురం: ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సమావేశంలో పాల్గొనేందుకు కానూర్ వచ్చిన కేరళ గవర్నర్ అరీఫ్ మహ్మద్ ఖాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనడానికి శనివారం కానూర్ వచ్చిన గవర్నర్‌కు వ్యతిరేకంగా అక్కడి నిరసనకారులు ఆందోళనకు దిగారు. ఆయన ప్రసంగించే సమయంలో సీఏఏ, ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న వారిపై గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైనేజ్‌లో మురికి దుర్వాసన వలె ఉన్నారంటూ నిరసనకారులను ఉద్దేశించి గవర్నర్ మండిపడ్డారు. వ్యక్తిగత ఎజెండాతో నిరసనలు చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.
కాగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. శాంతియుతంగా నిరసనలు చేసే హక్కు రాజ్యాంగం కల్పించిందని ప్రతిపక్ష పార్టీ నాయకులు తెలిపారు. కాగా సీఏఏను తొమ్మిది రాష్ట్రాల సీఎంలు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.