breaking news
Kanooru
-
నిరసనకారులపై కేరళ గవర్నర్ ఆగ్రహం
తిరువనంతపురం: ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సమావేశంలో పాల్గొనేందుకు కానూర్ వచ్చిన కేరళ గవర్నర్ అరీఫ్ మహ్మద్ ఖాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనడానికి శనివారం కానూర్ వచ్చిన గవర్నర్‌కు వ్యతిరేకంగా అక్కడి నిరసనకారులు ఆందోళనకు దిగారు. ఆయన ప్రసంగించే సమయంలో సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న వారిపై గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైనేజ్‌లో మురికి దుర్వాసన వలె ఉన్నారంటూ నిరసనకారులను ఉద్దేశించి గవర్నర్ మండిపడ్డారు. వ్యక్తిగత ఎజెండాతో నిరసనలు చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. శాంతియుతంగా నిరసనలు చేసే హక్కు రాజ్యాంగం కల్పించిందని ప్రతిపక్ష పార్టీ నాయకులు తెలిపారు. కాగా సీఏఏను తొమ్మిది రాష్ట్రాల సీఎంలు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. -
కానూరులో అంతర్ జిల్లా దొంగ అరెస్టు
పెనమలూరు, న్యూస్‌లైన్ : పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడిన అంతర్ జిల్లా దొంగను పెనమలూరు పోలీసులు మంగళవారం కానూరులో అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.7లక్షల విలువైన వస్తువులను స్వాధీనపర్చుకున్నారు. కానూరులోని ఏసీపీ తూర్పు డివిజన్ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో డీసీపీ ఎం.రవిప్రకాష్ వివరాలు వెల్లడించారు. గుంటూరు ఆనంద్‌పేటకు చెందిన షేక్ అమీర్‌బాషా అలియాస్ షేక్ జమీర్‌బాషా.. కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో తన సహచరులతో కలిసి అనేక దొంగతనాలు చేసినట్లు డీసీపీ పేర్కొన్నారు. విజయవాడ, గుంటూరు, తెనాలి, రాజమండ్రి, ఏలూరు, గుడివాడలో 20 పైగా చోరీలకు పాల్పడ్డాడు. ఏడు బైకులు, తొమ్మిది బంగారు గొలుసులు అపహరించాడు. పలు ఇళ్లల్లో చొరబడి విలువైన వస్తువులు, నగదు దోచుకున్నాడు. ప్రస్తుతం కానూరులోని సనత్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. గుంటూరులో ఉన్నప్పటినుంచే నేరాలు బాషా గతంలో గుంటూరులో పూలవ్యాపారం చేసేవాడు. జల్సాలకు అలవాటు పడడంతో దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. అతడి స్నేహితులు పఠాన్బుడే, అమీర్‌బేగ్, జోహార్, జావేద్ఖాన్, ముస్తాఫాఖాన్, అబ్దుల్లాతో కలిసి గుంటూరు, లాలాపేట, తెనాలి, మంగళగిరి ప్రాంతాల్లో నేరాలు చేసి జైలుశిక్ష అనుభవించారు. జైలు నుంచి 2010లో బయటకు వచ్చిన అమీర్‌బాషా వివాహం చేసుకుని కానూరుకు మకాం మార్చాడు. జైల్లో పరిచయమైన పాతనేరస్తులు గంజి చిన్నా, తిరుపతయ్యతో కలిసి మళ్లీ దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. గంజి చిన్నా, మరో పాతనేరస్తుడు ముస్తాఫాఖాన్లను మూడు నెలల క్రితం పటమట పోలీసులు అరెస్టు చేశారు. రెండు నెలల క్రితం జావేద్ఖాన్, నయీమ్‌లను పెనమలూరు పోలీసులు అరెస్టుచేశారు. తిరుపతయ్యను తెనాలి పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. అమీర్‌బాషా కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎట్టకేలకు సనత్‌నగర్‌లో అరెస్టు చేశారు. నిందితుడి నుంచి నాలుగు బైక్‌లు, 104 గ్రాముల బంగారు అభరణాలు,17 వేల నగదు, రెండు ఎల్సీడీలు, ఒక డీవీడీ ప్లేయర్, వెండినగలతోపాటు రాజమండ్రి గౌరీపట్నం వద్ద కొన్న ఇంటి స్థలం దస్తావేజులు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. బాషా మారు పేరుతో రాజమండ్రిలో ఆధార్ కార్డు కూడా పొందాడని చెప్పారు.