నేనే రాజు.. నేనే మంత్రి | Police Special Vehicle For Yarapathineni Srinivasarao Guntur | Sakshi
Sakshi News home page

నేనే రాజు.. నేనే మంత్రి

Aug 27 2018 1:01 PM | Updated on Aug 27 2018 1:01 PM

Police Special Vehicle For Yarapathineni Srinivasarao Guntur - Sakshi

ఈ నెల 24వ తేదీన మాచవరం మండలంలో పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే కాన్వాయ్‌లో ఉన్న రెండు పోలీసు వాహనాలు

పల్నాడు ప్రాంతంలోని సున్నపురాయి, ఖనిజ నిక్షేపాల అక్రమ తరలింపులో తెర వెనుక సూత్రధారి. కోర్టు నోటీ సులు అందుకున్న ప్రజాప్రతినిధి.  ఆయన గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో అడుగుపెడితే చాలు పోలీస్‌ వాహనాలు ఎదురొచ్చి మరీ స్వాగతం పలుకుతాయి. మంత్రులకు కూడా లేని ఆర్భాటపు హంగులు ఆయన వెన్నంటే నడుస్తాయి. నిబంధనలన్నీ తన అధికార పీఠం కింద నలిగిపోతుంటాయి. జిల్లా పోలీస్‌ బాస్‌లకే తెలియకుండా ఎస్కార్ట్‌ వాహనాలు ఆయన కాన్వాయ్‌లో వచ్చి చేరుతుంటాయి. చిన్నబాబు అండతో ప్రజాస్వామ్య విలువలకు పాతర పడుతుంటాయి. ఆయనే అక్రమ మైనింగ్‌కు కేరాఫ్‌గా మారిన గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు.  తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని పోలీస్‌ వ్యవస్థను అడ్డగోలుగా దుర్వినియోగం చేస్తున్నారు. అదెలాగో ఒక్కసారి చూడండి.

సాక్షి, గుంటూరు: ఆయన స్పీకర్‌ కాదు.. మంత్రి కాదు.. కేవలం ఒక సాధారణ ఎమ్మెల్యే... ఎటువంటి కేబినెట్‌ హోదాగానీ, రాష్ట్రస్థాయిలో ప్రొటోకాల్‌ పదవిగానీ లేవు.. ఉన్నదల్లా అక్రమ మైనింగ్‌ ఆరోపణలు మాత్రమే.. ఆయన వస్తున్నారనే సమాచారం అందీ అందగానే అర గంట ముందు నియోజకవర్గ ముఖ ద్వారం వద్ద టీడీపీ నేతలతోపాటు, రెండు, మూడు పోలీసు వాహనాలు స్వాగతం పలికేందుకు ఎదురుచూస్తూ ఉంటాయి. ఇదేంటి ఏ ఎమ్మెల్యేకూ ఈ స్థాయిలో ప్రోటోకాల్‌ ఇవ్వరు కదా..! అని ఆలోచిస్తున్నారా ? చినబాబుకు ఆయన అత్యంత సన్నిహితుడు.. పోలీస్‌ వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకున్న ప్రజాప్రతినిధి.. ఆయనే గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు. చినబాబు అండ ఉండడంతోనే హోంమంత్రికి కూడా లేని విధంగా ఈయనకు కాన్వాయ్‌ను ఏర్పాటు చేసి పోలీసులు స్వామి భక్తిని చాటుకుంటున్నారు.

హోదా లేకపోయినా..
జిల్లాలో స్పీకర్‌తోపాటు, ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎంపీలతోపాటు కేబినెట్‌ హోదా ఉన్న అనేక మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. పోలీసు శాఖలో గురజాల ఎమ్మెల్యే యరపతినేని పరపతి వేరు. మంత్రులు జిల్లాలో ఎక్కడకు వెళ్ళినా సం బంధిత పోలీసు స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో వాహనం ఎస్కార్ట్‌గా వెళుతుంది. అయితే యరపతినేని మా త్రం నియోజకవర్గం నుంచి పక్క నియోజకవర్గమైన మాచర్ల వరకు ఎక్కడకు వెళ్ళినా ప్రత్యేక పో లీసు వాహనం వెంట నడుస్తుంది. ఆయన కోసం పిడుగురాళ్ళ పోలీసు స్టేషన్‌లో హైవే పెట్రోలింగ్‌ వాహనాన్ని ప్రత్యేక ఎస్కార్ట్‌ కోసం ఉంచా రు. పల్నాడు ప్రాంతంలోని గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లోని తొమ్మిది మండలాల్లో ఎక్కడకు వెళ్లినా ఈ వాహనం ఆయన కాన్వాయ్‌ ముం దు సైరన్‌ మోగిస్తూ దూసుకుపోతుంది. ఈ వాహనంతోపాటు, ఆయా పోలీసు స్టేషన్‌ల సీఐలు ఎస్కా ర్ట్‌ ఇస్తూ ఆయన కాన్వాయ్‌ను ఫాలో అవుతారు. మళ్లీ ఆయన నియోజకవర్గం దాటిన తరువా త మాత్రమే వెనక్కు వస్తుంది. రాష్ట్రంలోనే కాదు దే శంలో ఏ ఎమ్మెల్యేకు పోలీసులు ఈ స్థాయిలో ప్రో టోకాల్‌ పాటిస్తున్న దాఖలాలు లేవని అధికా ర పార్టీ ప్రజాప్రతినిధులే చెబుతున్నారు. ప్రభు త్వం వ్యవస్థలను ఏ స్థాయిలో దుర్వినియోగం చే స్తున్నారో చెప్పేందుకు ఈ ఒక్క ఉదాహరణ చాల ని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నా రు.

విజయవాడ నుంచి ప్రత్యేక వాహనం
గతంలో గుంటూరు జిల్లా పోలీసు కార్యాలయం నుంచి పిడుగురాళ్లకు ప్రత్యేక వాహనాన్ని పంపి యరపతినేని కాన్వాయ్‌కు కేటాయించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మెల్యేకు ఎస్కార్ట్‌ ఇవ్వడంపై ఆగ్రహించిన జిల్లా ఉన్నతాధికారులు.. ఆ వాహనాన్ని వెనక్కి పిలిపించారు. దీంతో చిన్నబుచ్చుకున్న ఎమ్మెల్యే తన అధికారాన్ని ప్రయోగించారు. జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు తెలియకుండా విజయవాడ నుంచి హైవే పెట్రోలింగ్‌ వాహనాన్ని పిడుగురాళ్ల పోలీసు స్టేషన్‌కు తెప్పించారు. ఎమ్మెల్యే యరపతినేని తన అధికారాన్ని ఏ స్థాయిలో దుర్వినియోగం చేస్తున్నారో దీనిని బట్టి అర్థమవుతోంది. ఆయన అధికార దుర్వినియోగంపై ప్రతిపక్షాలతోపాటు, సొంత పార్టీ నేతలు సైతం తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.  ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదంటూ మండిపడుతున్నారు.

అధికార దుర్వినియోగం
ఎమ్మెల్యే యరపతినేని అధికార దుర్వినియోగం చేస్తున్నారు. నిత్యం ఒక సీఐ, ఎస్సైతో వాహనాలతో ముందు వెళుతూ పోలీసులను ఇష్టానురీతిగా వినియోగించుకుంటున్నారు. అంబులెన్సు వచ్చినా దారి ఇవ్వకుండా అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నుకున్న ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.-కొఠారి నరసింహారావు, పిడుగురాళ్ల

ఇది సరైన పద్ధతి కాదు
ముందు రెండు పోలీసు వాహనాలు, వె నుక ఐదారు స్కార్పియోలతో కాన్వాయ్‌. ఎస్సై, సీఐ కూడా కాన్వాయ్‌లో ఉంటారు. ఇతను ఎవరా అని ఆరా తీస్తే స్థానిక ఎమ్మెల్యే. ప్రజలకు అందుబాటులో ఉండని ఆయన.. ఇలా పోలీసు వ్యవస్థను మేనేజ్‌ చేస్తూ తిరుగుతుంటారు. ఇది సరైన పద్ధతి కాదు. – జానపాడు ఖాశిం, పిడుగురాళ్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement