శెట్టిపల్లి భూముల జోలికి రావొద్దు: పవన్‌

Pawan Kalyan warns Chandrababu Govt about Settipalli lands issue - Sakshi

సాక్షి, తిరుపతి/అమరావతి: తిరుపతి సమీపంలోని శెట్టిపల్లిలో గ్రామస్తులు ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూముల జోలికి రావొద్దంటూ ప్రభుత్వాన్ని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ హెచ్చరించారు. బుధవారం ఆయన శెట్టిపల్లిలో రైతులు, గ్రామస్తులతో సమావేశమై భూముల వివరాలడిగి తెలుసుకున్నారు.

రైతులెవరూ తమ భూములను ఇవ్వొద్దని, బాధితులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వేలకోట్ల దోచుకుంటూ, పేదల భూములనూ లాక్కుంటారా? అని ప్రశ్నించారు. పట్టాలిస్తామని గ్రామదేవతపై ప్రమాణం చేసి ఇప్పుడు ఆర్థికనగరం పేరుతో భూ సమీకరణ అని భూములు లాగేసుకుంటున్నారని పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top