హుజూర్‌నగర్‌లో పద్మావతి భారీ మెజారిటీతో గెలుస్తారు

Padmavati Will Win By A Huge Majority In Huzurnagar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో.. రాజకీయ పార్టీలు ఏ అభ్యర్థికి టిక్కెట్ ఇచ్చినా.. కాంగ్రెస్‌కు ఎవరు పోటీ కాదని, కచ్చితంగా ఉత్తమ్‌ పద్మావతి రెడ్డి భారీ మెజారిటీతో గెలుస్తారని ఏఐసీసీ ఇంఛార్జ్ ప్రధాన కార్యదర్శి ఆర్‌సీ కుంతియా అన్నారు. గురువారం గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన  బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ నేతలు ప్రచారం కోసం గాంధీజీ కళ్ళద్దాలను, గాంధీ పేరును వాడుకుంటారు కానీ, గాడ్సేకు గుడి కడతారని ఎద్దేవా చేశారు. 

పార్లమెంటు ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ ఏడు ఎంపీ సీట్లు ఓడిపోవడంతో.. హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో ఆ పార్టీ భయపడుతుందని కుంతియా వ్యాఖ్యానించారు. అందుకే సీపీఐ  మద్దతు కోరుతోందని అన్నారు. ఇంతకు ముందు అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కోదాడలో కుట్ర చేసి ఓడించిందని కుంతియా పేర్కొన్నారు. హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌  ఓడిపోతుందనీ, తమ పార్టీ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, జానారెడ్డి, రేవంత్ రెడ్డిలు ప్రచారం చేసి పద్మావతి రెడ్డిని గెలిపిస్తారన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top