30న భారత్ బచావో ర్యాలీ: కుంతియా

Bharat Bachao Rally Will Be Held On Nov 30 Says Kuntiya - Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 30న కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన భారత్ బచావో ర్యాలీకి పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరు కావాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ ఆర్‌సీ కుంతియా కోరారు. శనివారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రజావ్యతిరేక నిర్ణయాలపై నిర్వహించిన సమావేశంలో హాజరైన ఆయన మాట్లాడుతూ.. భారత్ బచావో నిరసన కార్యక్రమం గురించి చర్చించామని అన్నారు. అలానే నోట్ల రద్దు, జీఎస్టీ అమలు తర్వాత దేశ ప్రగతి, దేశ ఆర్థిక వ్యవస్థ, నిరుద్యోగంపై కూడా చర్చించామని, సమావేశంలో మోదీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక నిర్ణయాలపై ఈ నెల 25 వరకు అన్ని రాష్ట్రాలు, జిల్లా కేంద్రాల్లో ఈ నెల 25 వరకు భారత్ బచావో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

అదేవిధంగా ఢిల్లీలో ఈ నెల 30న తలపెట్టిన భారత్ బచావో ర్యాలీకి తెలంగాణలోని ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పది మంది కాంగ్రెస్ కార్యకర్తలు రావాలని తెలంగాణ పిసిసి చీఫ్‌ ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. భారత్ బచావో నిరసన కార్యక్రమం నిర్వహించాలని ఈ మేరకు అన్ని రాష్ట్రాల పీసీసీలకు ఆదేశాలు జారీ అయ్యాయని వివరించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top