టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్‌రావు

Naveen Rao As TRS MLC Candidate - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కుర్మయ్యగారి నవీన్‌రావు పేరును ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ ఖరారు చేశారు. లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల ప్రకటన సందర్భంగా గుత్తా సుఖేందర్‌రెడ్డి, నవీన్‌రావులకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒక ఖాళీ ఏర్పడటంతో నవీన్‌రావును ఎంపిక చేశారు. త్వరలో ఖాళీ కానున్న 3 ఎమ్మెల్సీ స్థానాల్లో గుత్తాకు అవకాశం ఇస్తామని కేసీఆర్‌ స్పష్టంచేశారు. కాగా, మంగళవారం ఉదయం 11 గంటలకు నవీన్‌రావు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top