‘నల్లగొండ’ బరిలో...27మంది

Nalgonda Election Candidates Approved List 2019 - Sakshi

సాక్షి, నల్లగొండ : నల్లగొండ పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేసేందుకు అభ్యర్థులు అత్యధికంగా పోటీపడ్డారు. మొత్తం పార్లమెంట్‌కు 39మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించగా ఎనిమిది మందివి నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో తిరస్కరించిన విషయం తెలిసిందే. నామినేషన్ల ఉపసంహరణకు రెండు రోజుల గడువులో నలుగురు మాత్రమే నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో నల్లగొండ పార్లమెంట్‌ బరిలో మొత్తం 27 మంది అభ్యర్థులు రంగంలో నిలిచారు. 

అత్యధికంగా పోటీ..  
నల్లగొండ పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు చాలామంది పోటీ పడుతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు రిజిస్టర్, గుర్తింపు పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు పెద్దఎత్తున నామినేషన్లు సమర్పించారు. దీంతో నల్లగొండ ఎంపీ స్థానానికి పెద్దఎత్తున పోటీ ఏర్పడింది. అప్పట్లో జలసాధన సమితి నుంచి అత్యధికంగా పోటీ చేయడంతో బ్యాలెట్‌ పేపర్‌ ముద్రణ విషయంలో ఆలస్యం కావడంతోపాటు పోలింగ్, లెక్కింపులో కూడా చాలా ఇబ్బందులు జరిగిన విషయం అందరికీ తెలిసిందే.

రెండు బ్యాలెట్‌ యూనిట్లు తప్పనిసరి... 

అయితే ప్రస్తుతం ఈవీఎంల ద్వా రా ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక్కో బ్యాలెట్‌ యూనిట్‌లో 16 గుర్తులతోపాటు ఒక నోటా ఉం టుంది. నల్లగొండ పార్లమెంట్‌లో మొత్తం 27 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నందున ఒక కంట్రో ల్‌ యూనిట్‌కు రెండు బ్యాలెట్‌ యూనిట్లను వాడాల్సి ఉంటుంది.  

గుర్తుల కేటాయింపు పనిలో అధికారులు
నామినేషన్ల ఉపసంహరణ ముగి యడంతో రంగంలో ఉన్న అభ్యర్థులకు ఎన్నికల అధికారులు గు ర్తులను కేటాయిస్తున్నారు. ఇండిపెండెంట్లకు ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికల గర్తుల కేటాయిస్తున్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top