మోత్కుపల్లిని కలిసిన ముద్రగడ

Mudragada Padmanabham Meet With Mothkupally - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై ఆ పార్టీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు మాటల తూటాలు పేల్చన విషయం తెలిసిందే. అయితే  శుక్రవారం ఉదయం మోత్కుపల్లిని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆయన ఇంట్లో కలిసి తాజా పరిణామాలపై మంతనాలు జరిపారు. టీడీపీకి 35 ఏళ్లు సేవచేసిన మోత్కుపల్లి పట్ల పార్టీ వ్యవహరించిన తీరును ముద్రగడ తప్పుబట్టారు. అవసరానికి వాడుకొని వదిలేయడం బాబు నైజమని ముద్రగడ దుయ్యబట్టారు. 

మోత్కుపల్లి పోరాటానికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని ముద్రగడ అన్నారు. అదేవిధంగా ఏపీలో కాపు ఉద్యమం, బాబు దుర్మార్గపు పాలన తమ పోరాటానికి మద్దతు కావాలని మోత్కుపల్లిని కోరారు. దీనికి ఏపీలో ప్రభుత్వంపై పోరాటాలకు తన మద్దతు ఉంటుందని మోత్కుపల్లి అన్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top