కాపీ, పేస్ట్‌ బడ్జెట్‌: ఒవైసీ

Modi Govt Can Only Paste: Asaduddin Owaisi - Sakshi

న్యూఢిల్లీ: కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌ కాపీ, పేస్ట్‌ బడ్జెట్‌ అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఎద్దేవా చేశారు. సొంత ఆలోచనలు, దార్శనికత లేకుండా బడ్జెట్‌ రూపొందించారని విమర్శించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు లాంటి నాయకులు దేశాన్ని ముందుకు నడిపించాల్సిన అవసరం ఉందన్నారు.

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా కేంద్ర మధ్యంతర బడ్జెట్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బడ్జెట్‌ను ఆర్థిక అధికారులు తయారు చేశారా, ఆర్‌ఎస్‌ఎస్‌ చేసిందా అని ఆయన ప్రశ్నించారు. తాను రైతులకు రుణమాఫీ ప్రకటించినప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారని, ఇప్పుడు ఆయనే రైతులకు తాయిలాలు ప్రకటించారని తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top