చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న గ్రామస్తులు

Mass Halted CM Chandrababu Naidu In Kaviti In Srikakulam District - Sakshi

సమస్యలు వినకుండా వెళ్తున్నారని ఆగ్రహం

సాక్షి, కవిటి/శ్రీకాకుళం : టిట్లీ తుపానుతో అతలాకుతలమైన తమను ప్రభుత్వం పట్టించుకోలేదని కవిటి గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. తుపాను ప్రభావ ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు కాన్వాయ్‌ను కవిటి గ్రామంలోని మత్స్యకారులు శనివారం అడ్డుకున్నారు. తమ గ్రామం నుంచి వెళ్తూ తమ బాగోగులు పట్టించుకోకుండా వెళ్తున్న సీఎంపై తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కాన్వాయ్‌కి అడ్డుతగిలి తమ గోడును వెళ్లగక్కారు.

మూడు రోజులుగా తిండీ తిప్పలు లేకుండా అంధకారంలో గడిపామనీ, ప్రభుత్వం చెప్తున్నట్టుగా తమకు ఎలాంటి సహాయం అందలేదని వాపోయారు. దీనిపై స్పందించిన చంద్రబాబు టిట్లీ బాధితుల సహాయార్ధం అన్ని సహాయక చర్యలు చేపట్టామనీ, సాక్షాత్తు ముఖ్యమంత్రి కాన్వాయ్‌కి అడ్డుతగలడం భావ్యం కాదని అన్నారు. కాగా, తుఫాను విధులకు సక్రమంగా హాజరు కాలేదని ప్రజలు ఫిర్యాదు చేయడంతో కవిటి మండల అభివృద్ధి అధికారిని సస్పెండ్ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top