రాజ్యసభ సభ్యుడిగా మన్మోహన్‌ ప్రమాణం

 Manmohan Singh Takes Oath As Rajya Sabha MP - Sakshi

న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ మరోసారి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు శుక్రవారం ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. రాజస్తాన్ నుంచి మన్మోహన్‌సింగ్‌ తిరిగి రాజ్యసభకు ఎన్నికయ్యారు. పెద్దల సభకు మన్మోహన్‌ ఎన్నికవడం ఇది ఆరవసారి. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, థావర్ చంద్ గెహ్లోత్‌, గులాంనబీ ఆజాద్, ఆనంద్ శర్మ, అహ్మద్ పటేల్, రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లోత్‌, సచిన్ పైలట్‌తో పాటు కొంతమంది బీజేపీ నాయకులు కూడా హాజరయ్యారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top