షాకింగ్‌.. పొరపాటున బీజేపీకి ఓటేసి.. !

man chops off his finger after voting for BJP by mistake - Sakshi

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌ బులంద్‌షహర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. బీఎస్పీకి బదులు పొరపాటున ఈవీఎంలో బీజేపీ గుర్తుకు ఓటు వేయడంతో ఓ దళితుడు తన వేలిని నరికేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న పలు లోక్‌సభ స్థానాలకు  రెండోదఫా పోలింగ్‌ గురువారం జరిగిన సంగతి తెలిసిందే. శిఖర్‌పుర ప్రాంతంలోని అబ్దుల్లాపూర్‌ హులాసన్‌ గ్రామానికి చెందిన పవన్‌ కుమార్‌ (25) ఈ ఘటనకు పాల్పడ్డాడు.

పొరపాటున బీజేపీ గుర్తుకు ఓటేయడంతో కోడవలిని ఉపయోగించి తన చేతి వేలిని పవన్‌ నరికేసుకున్నాడు. వేలిని నరికేసుకున్న తర్వాత పొరపాటున బీజేపీకి ఓటేశానంటూ అతను విచారం వ్యక్తం చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఎస్పీ-బీఎస్పీ-ఆరెల్డీ అభ్యర్థి యోగేశ్‌ వర్మకు ఓటేయాలని పోలింగ్‌ కేంద్రానికి వెళ్లిన పవన్‌.. పొరపాటున బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎంపీ భోలా సింగ్‌కు ఓటేశాడని, జరిగిన పొరపాటున తెలుసుకొని తనపై తానే ఆవేశానికి లోనై.. వేలిని నరికేసుకున్నాడని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top