‘సీఎం జగన్‌పై మందకృష్ణ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం’

Mala Mahanadu Leaders Applaud CM YS Jagan Decision Over Nominated Posts - Sakshi

మాల మహానాడు నాయకులు అశోక్‌ కుమార్‌, సూర్యప్రసాద్‌

సాక్షి, అమరావతి : నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని మాల మహానాడు నాయకులు అశోక్‌ కుమార్‌, సూర్యప్రసాద్‌ హర్షం వ్యక్తం చేశారు. గతంలో దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కూడా భారీ సంఖ్యలో దళితులకు ఎమ్మెల్సీ, నామినేటెడ్‌ పదవులను కట్టబెట్టారని గుర్తుచేశారు. టీడీపీ నేత చంద్రబాబు నాయుడు మాత్రం ఎల్లప్పుడు మాల, మాదిగల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. అయితే సీఎం జగన్‌ మాత్రం ఇరు సామాజిక వర్గాలను సమానంగా చూస్తున్నారన్నారు. అటువంటి జననేతపై మంద కృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top