‘అందుకే సురేశ్‌ రెడ్డి పార్టీ వీడారు’

Madhu Yaskhi fires on KCR - Sakshi

హైదరాబాద్‌: మాజీ స్పీకర్‌ సురేశ్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరడం వల్లే వచ్చే నష్టం ఏమీ లేదని మాజీ ఎంపీ మధుయాష్కీ విమర్శించారు. ఈ క్రమంలోనే సురేశ్‌ రెడ్డి పార్టీ ఎందుకు మారాల్సి వచ‍్చిందో మధుయాష్కీ స్పష్టం చేశారు. సురేష్‌ రెడ్డికి టికెట్‌ ఇ‍వ్వకూడదని ఆలోచిస్తున్నామని, అందుకే ఆయన పార్టీ మారాడన్నారు.  మురికి నీరు కొట్టుకుపోతే, కొత్త నీరు వస్తుందంటూ సురేష్‌ రెడ్డి పార్టీ మారడాన్ని ఎద్దేవా చేశారు. తమ పార్టీలో చేరడానికి అనేకమంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల‍్సీలు సిద్ధంగా ఉన్నారన్నారు. అసలు టీఆర్‌ఎస్‌ వంద సీట్లు గెలిచే ధైర్యం ఉంటే ఇతర పార్టీ నేతల కాళ్ల మీద ఎందుకు పడుతున్నారంటూ మధుయాష్కీ మండిపడ్డారు. 

మరొకవైపు మాజీ మంత్రి గీతారెడ్డి మాట్లాడుతూ..కేసీఆర్‌వి పచ్చి అబద్ధాలని, దళితుడ్ని సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్‌ ...ఎస్సీలను మోసం చేయడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌ పతన ఖాయమని గీతారెడ్డి అభిప్రాయపడ్డారు. తనపై పోటీకి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే లేరన్న గీతారెడ్డి.. జహీరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో గెలుపు తనదేని ఈ సందర్భంగా స్పష్టం​ చేశారు. 

కారెక్కిన కాంగ్రెస్‌ నేత సురేశ్‌ రెడ్డి

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top