
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ప్రగతి భవన్‌ను ప్రజా ఆసుపత్రిగా మారుస్తామని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ తెలిపారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని విమర్శించారు.
కూకట్‌పల్లి నియోజకవర్గం కేపీహెచ్‌బీ కాలనీలో కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘బస్తీబస్తీకి తెలుగుదేశం పార్టీ’కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ ప్రభు త్వం మాటలకే పరిమితం అయ్యిందని ఎద్దేవా చేశారు. పొలిట్‌బ్యూరో సభ్యుడు ఇనుగాల పెద్దిరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం తరఫున గెలిచి, టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఎన్నికల్లో ప్రజలు తగురీతిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.