ఆయనకు వయసైపోయింది!

Kushboo Fired on Sellur K Raju - Sakshi

పెరంబూరు: సెల్లూర్‌ రాజుకు వయసైపోయ్యిందని నటి, అఖిలభారత కాంగ్రెస్‌ పార్టీ ప్రచార కర్త కుష్బూ అన్నారు. ఆమె ఎన్నికల ప్రచారంలో ఎక్కువగా పాల్గొనడం లేదు. కుష్బూ తమిళనాడు కాంగ్రెస్‌ పార్టీలో నాయకుడు అని చెప్పుకునే ఏకైన వ్యక్తి ఈవీకే.ఇళంగోవన్‌. ఆయన కోసం ఆయన పోటీ చేస్తున్న కోవైలో కుష్బూ ప్రచారం చేశారు. అలా ఉచలంపట్టిలో నిర్వహించిన ప్రచారసభలో కుష్బూ ఆన్నాడీఎంకే నాయకులపై ఆరోపణలు గుప్పించారు.

దీంతో కుష్బూ ఆరోపణలకు ఎదురుదాడి చేసిన అన్నాడీఎంకే మంత్రి సెల్లూర్‌ రాజు వైగై నదిలో పెరుమాళ్‌( వేంకటేశ్వరస్వామి)కి స్నానం చేయించినా జనం వస్తారని అన్నారు. కాగా నటీనటుల ప్రచారానికి వచ్చే జనం ఓట్లుగా మారవని అన్నారు. అదే విధంగా నటి కుష్బూపైనా ఆరోపణలు చేశారు. కుష్బూకు వయసైపోయ్యిందన్నారు, ఆమె ఒంటి రంగు గురించి కూడా వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలకు ట్విట్టర్‌లో స్పందించిన నటి కుష్బూ మన అన్నాడీఎంకే జ్ఞాని సెల్లూర్‌ రాజుకు వయసైపోయ్యిందన్నది బాగా తెలుస్తోందని పేర్కొన్నారు. పాపం ఏదేదో మాట్లాడుతున్నారని అన్నారు. అయినా తన ప్రచారానికి  వస్తున్న జనం గురించి ఆయన గమనించడం గర్వంగా ఉందన్నారు. 30 ఏళ్ల తరువాత కూడా ఇలా చేయగలుగుతున్నానంటే అది తమి ళ ప్రజల గొప్పేనని నటి కుష్బూ పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top