రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌తో పొత్తా?

Kurasala Kanna Babu Slams CM Chandrababu Naidu - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి:  రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్‌తో చేతులు కలుపుతారా? అని టీడీపీపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత కురసాల కన్నబాబు మండిపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌-టీడీపీలు కలిసి పనిచేస్తున్నాయన్నారు. తమ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై ఆరోపణలు మోపి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకులు సక్రమంగా పనిచేయకపోవడంతోనే తమ నాయకుడు వైఎస్‌ జగన్‌ జనంలోకి వెళ్లారన్నారు.

పవన్‌ కల్యాణ్‌ పారిపోయేవారు..
చంద్రబాబు హామీలకు తనే బాధ్యుడ్ని అని చెప్పిన పవన్‌ కల్యాణ్‌ ఒక్కసారి కూడా ఎందుకు ప్రశ్నించలేకపోయారని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా నిలదీశారు. శాసనసభలో టీడీపీ అరాచకాలను ఇన్నాళ్లు తమ అధినేత వైఎస్‌ జగన్‌ ఎదుర్కోగలిగారన్నారు. పవన్‌ అయితే ఒక్క రోజు కూడా ఉండలేక ముందే పారిపోయేవారని విమర్శించారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను పవన్‌కు కనబడటం లేదా అని మరో వైఎస్సార్‌సీపీ నేత జక్కంపూడి రాజా ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా సామాన్యుల బాధలు జగన్‌ తెలుసుకుంటున్నారని తెలిపారు. అన్ని వర్గాలను మోసం చేసిన చంద్రబాబు ఫ్యాక్షనిస్టా.. ప్రజలతో మమేకమైన వైఎస్‌ జగన్‌ ఫ్యాక్షనిస్టా? అని రాజా ప్రశ్నించారు. గోదావరి జిల్లాల్లో ఎక్కడ కష్టం వచ్చినా ముందుగా వచ్చేది జగనేనని స్పష్టం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top