‘కబ్జాదారుల చేతుల్లో ఉన్న భూములు స్వాధీనం’ | Koyya Prasad Reddy Slams TDP Leaders In Vizag | Sakshi
Sakshi News home page

‘కబ్జాదారుల చేతుల్లో ఉన్న భూములు స్వాధీనం’

Sep 26 2019 12:50 PM | Updated on Sep 26 2019 12:58 PM

Koyya Prasad Reddy Slams TDP Leaders In Vizag - Sakshi

సాక్షి, విశాఖపట్నం : విశాఖ అభివృద్ధిని ఓర్వలేకే టీడీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్‌రెడ్డి విమర్శించారు. మాజీ మంత్రి అయ్యన్న విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని, ఐదేళ్ల భూ కబ్జాలను అడ్డుకున్న పోలీసులపై విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. రానున్న కాలంలో కబ్జాదారుల చేతుల్లో ఉన్న సర్కారు భూములు స్వాధీనం చేసుకోవడం ఖాయమని స్పష్టం చేశారు. టీడీపీ నేతల ఐదేళ్ల అక్రమాలకు అడ్డుకట్ట పడుతోందని వెల్లడించారు. వంద రోజుల్లోనే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందించిన సంక్షేమ పథకాలకు జనం నీరాజనం పలుకుతున్నారని ప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు.

చదవండి : దేవతల యజ్ఞాన్ని రాక్షసులు అడ్డుకున్నట్టు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement