
కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: తమ శాసనసభ సభ్యత్వాల రద్దుపై కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్ గురువారం హైకోర్టును ఆశ్రయించారు. స్పీకర్ ఏకపక్ష నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రొసీడింగ్ సరిగా జరగలేదని, సభ్యుల వివరణ తీసుకోకుండానే తమపై చర్య తీసుకున్నారని న్యాయస్థానానికి విన్నవించారు. తమపై అనర్హత వేటు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్ వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని ఆరోపించారు. స్పీకర్ నిర్ణయంపై స్టే ఇవ్వాలని హైకోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు రేపు విచారించనుంది.
ఈసీకి ఫిర్యాదు
కోమటి రెడ్డి, సంపత్‌కుమార్ శాసనసభ్యత్వాలను రద్దు రాజ్యాంగ విరుద్దమని ఢిల్లీలో జాతీయ ఎన్నికల సంఘానికి తెలంగాణ కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు మర్రి శశిధర్‌రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. హైకోర్టు తీర్పు వచ్చే వరకు తదుపరి చర్యలు తీసుకోవద్దని ఈసీకి విన్నవించినట్టు ఆయన తెలిపారు. కర్ణాటకతో పాటు ఉప ఎన్నిలొస్తాయని మంత్రి హరీశ్‌రావు చెబుతున్న విషయాన్ని ఈసీకి తెలిపామని వెల్లడించారు.