ఐదోసారి అత్యధిక మెజార్టీతో ఆశీర్వదించి గెలిపించండి

komatireddy venkat reddy Fair on KCR Nalgonda - Sakshi

సాక్షి, నల్లగొండరూరల్‌ : నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యే..మంత్రిగా పనిచేసి నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశా.. ఐదోసారి ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన పట్టణంలోని పలువార్డులతో పాటు నల్లగొండ మండలం దండెంపల్లి గ్రామంలో పర్యటించారు. ఇంటింటికీ తిరిగి ఓటర్లను అభ్యర్థించారు. ఆయా కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. నా రాజకీయ జీవితంలో నిరంతరం ప్రజలకు సేవ చేసేందుకే పరితపించానని పేర్కొన్నారు. ప్రజాభిష్టం మేరకు ఆమరణ నిరాహార దీక్ష, పదవీ త్యాగానికి కూడా వెనుకాడలేదని గుర్తు చేశారు. తనను ఓడించేందుకు టీఆర్‌ఎస్‌ నాయకులు కుట్రలు పన్నుతున్నారని.. వారి అభిష్టాన్ని ప్రజలే తిప్పికొట్టాలని విజ్ఞప్తి చేశారు.  నాడు తెల ంగాణ ఉద్యమానికి ద్రోహం చేసిన నాయకులకు ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

‘ఇందిరమ్మ’ తరహాలో..
కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇందిరమ్మ పథకం తరహాలో సొంతభూమి ఉన్న వారికి ఇల్లు కట్టుకునేందుకు రూ. 5లక్షలు ఇస్తామన్నారు. అదే విధంగా రైతులందరికీ ఏక కాలంలో రూ. 2లక్షల రుణమాఫీ చేస్తామని కోమటిరెడ్డి పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కేసీఆర్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని విమర్శించారు. కేసీఆర్‌ ప్రభుత్వంలో మహిళలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా 50శాతం ఉన్న మహిళలకు మంత్రి వర్గంలో స్థానం కల్పించకపోవడం సిగ్గు చేటన్నారు.

కాంగ్రెస్‌ పార్టీలో చేరిక
పట్టణంలోని 10, 11వార్డుల్లో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలతో పాటు దండెంపల్లి గ్రామానికి చెందిన ఎంపీటీసీ చింతపల్లి రమణా రామలింగం, నర్సింహతో మరికొందరు కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. వారికి ఆయన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయా కార్యక్రమాల్లో మున్సి పల్‌ చైర్‌పర్సన్‌ బొడ్డుపల్లి లక్ష్మి, నాయకులు గుమ్మల మోహన్‌రెడ్డి  ఆలకుంట్ల లింగయ్య, చాపల లింగయ్య, యాదగిరిగౌడ్, సిరిగిరి వెంకట్‌రెడ్డి, పసల శౌరయ్య, ఎల్లయ్య, వంగూరి లక్ష్మయ్య, జెడ్పీటీసీ రాధాలింగస్వామి, మాజీ సర్పంచ్‌ అల్లి నాగలక్ష్మిశంకర్‌ యాదవ్, ధర్మయ్య ,శ్రీధర్‌రెడ్డి, గోపగోని శ్రీనివాస్‌గౌడ్, వెంకట్‌రెడ్డి, సైదిరెడ్డి పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top