వైఎస్‌ జగన్‌ను కలిసిన జీవితా రాజశేఖర్‌ | Jeevitha Rajasekhar couple meets ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ను కలిసిన జీవితా రాజశేఖర్‌

Apr 1 2019 9:46 AM | Updated on Apr 1 2019 12:50 PM

Jeevitha Rajasekhar couple meets ys jagan mohan reddy - Sakshi

వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సోమవారం ఉదయం ప్రముఖ నటుడు జీవితా రాజశేఖర్‌ దంపతులు కలిశారు.

సాక్షి, హైదరాబాద్‌ : వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సోమవారం ఉదయం ప్రముఖ నటుడు జీవితా రాజశేఖర్‌ దంపతులు కలిశారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఈ భేటీ జరిగింది. అనంతరం రాజశేఖర్‌ మాట్లాడుతూ...‘చాలా రోజుల తర్వాత వైఎస్‌ జగన్‌ను కలిశాను. మా మధ్య ఉన్న కొన్ని మనస్పర్థలు ఈ రోజుతో తొలగిపోయాయి. అప్పట్లో నేను అపరిపక్వతతో  ప్రవర్తించాను. నాకు శత్రుత్వం లేదు, కానీ ఎందుకో మనస్పర్థలు ఉన్నాయి. అవి తొలగించుకోవడానికే ఆయన దగ్గరకు వచ్చాను. అప్పటి జగన్‌ ఇప్పటి జగన్‌ వేరు. ఇప్పటికే ఆయనను కలవడం ఆలస్యం అయింది. యువకుడైన వైఎస్‌ జగన్‌కు ప్రజలు ఒక్క అవకాశం ఇవ్వాలి. ఆయన ముఖ్యమంత్రి అయ్యేందుకు మా వంతు కృషి చేస్తాం.’ అని అన్నారు.

ఈ సందర్భంగా జీవిత మాట్లాడుతు..ఎన్నికల ముందు ఇచ్చే డబ్బులు, చీరలకు ఆశపడద్దని ఓ‍టర్లకు సూచించారు. రాష్ట్ర భవిష్యత్‌ బాగుండాలంటే అది వైఎస్‌ జగన్‌తోనే సాధ్యమన్నారు. కష్టపడకుండా కొడుకును సీఎంను చేయాలనుకునేవారు మనకొద్దని, జగన్‌లాంటి కష్టపడేవాళ్లు మనకు కావాలని జీవిత అన్నారు. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement