
ధర్మారం(ధర్మపురి): రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ నరసింహన్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోటుపాట్లను గాలికొదిలి సీఎం కేసీఆర్‌కు ఏజెంట్‌లా మాట్లాడారని సీఎల్పీ ఉపనేత, జగిత్యాల ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి విమర్శించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మేడారం చెరువుకట్ట నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు.
గవర్నర్ నరసింహన్ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నిజాలు తెలుసుకొని మాట్లాడితే బాగుండేదన్నారు. సీఎం కేసీఆర్ మెప్పు పొందాలనే తాపత్రయం తప్ప గవర్నర్‌కు వేరే ఉద్దేశం లేదన్నారు. గవ ర్నర్ పదవి కాలం ముగుస్తున్నందున రాజ్యసభ సీటు పొందాలనే ఆశతోనే పొగుడుతున్నాడన్నారు. అవసరమైతే టీఆర్‌ఎస్‌లో చేరాలే కానీ గవర్నర్ పదవిని అగౌరవపరచ రాదన్నారు.