‘కేసీఆర్, హరీశ్‌లను అరెస్ట్‌ చేయాలి’

Jagga Reddy Wife Alleges KCR and Harish Rao - Sakshi

హైదరాబాద్‌: నకిలీ పాస్‌పోర్టు కుంభకోణం కేసు లో కేసీఆర్, హరీశ్‌రావులను కూడా అరెస్టు చేయాలని మాజీ ఎమ్మె ల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి (జగ్గారెడ్డి) సతీమణి నిర్మల డిమాండ్‌ చేశారు. ఈ కేసులో అసలు నిందితులైన కేసీఆర్, హరీశ్‌రావులను వదిలిపెట్టి తన భర్తను అక్రమంగా ఇరికించారన్నారు. చంచల్‌గూడ జైల్లో ఉన్న జగ్గారెడ్డిని బుధవారం ఆమె ములాఖత్‌లో కలసి వెళ్లారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అధికారులు సాధారణ ములాఖత్‌ ఇచ్చారని, జాలీ మధ్యలోంచి మాటలు స్పష్టంగా వినపడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగ్గారెడ్డి మచ్చలేని మనిషి అని కేసీఆర్‌ ఎలా ఎదిగారో ప్రజలందరికీ తెలుసన్నారు. జగ్గారెడ్డిని కలిసినవారిలో కుమారుడు భరత్‌సాయిరెడ్డి, కూతురు జయలక్ష్మీ ఉన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top