
సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజకీయాల్లో ఇటీవల తరచూ వినిపిస్తున్న ‘ఆపరేషన్ గరుడ’కు దర్శక, నిర్మాత, రచయిత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబేనని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఆరోపించారు. చంద్రబాబు తాను రాసుకున్న స్క్రిప్టును నటుడు శివాజీతో చెప్పించి, ఆపై ’ఆపరేషన్ గరుడ నిజం కావచ్చు..’ అంటూ నవ నిర్మాణ దీక్షలో ఆయనే దీర్ఘాలు తీయడం కుట్రలో భాగమేనని ఐవైఆర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
ఐవైఆర్ ట్విట్టర్‌లో పేర్కొన్న పూర్తి పాఠం.. ‘ఆపరేషన్ గరుడకు తమరే నిర్మాత, దర్శకులు, రచయిత. ఒక నటుడిని ఎంపిక చేసి తమ మాటలు ఆయనచే పలికించారు. ఈరోజు నవనిర్మాణ దీక్షలో ఆ నటుడు చెప్పింది నిజమే కావచ్చని సెలవిచ్చారు. ఏమి ఐడియా సాబ్‌జీ’ అని ట్వీట్ చేశారు.