కన్నడనాట హంగే!

IndiaTV Final Opinion Poll on Karnataka Elections - Sakshi

ఇండియా టీవీ సర్వే

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు మూడ్రోజుల ముందు వెలువడిన ఇండియా టీవీ సర్వే కూడా హంగ్‌ తప్పదనే సంకేతాలిచ్చింది. 223 అసెంబ్లీ స్థానాల్లో ఈ సంస్థ సర్వే చేసింది. ఇందులో కాంగ్రెస్‌ 96 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించనున్నప్పటికీ మేజిక్‌ ఫిగర్‌ను చేరుకోవటం కష్టమేనని పేర్కొంది. అటు బీజేపీ 85 స్థానాలతో రెండో స్థానంలో నిలవనుండగా..జేడీఎస్‌ 38 స్థానాలను కైవసం చేసుకుంటుందని సర్వే పేర్కొంది.

అయితే ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం ప్రారంభానికి ముందు ఈ పోల్‌ నిర్వహించినట్లు తెలిపిన ఇండియా టీవీ.. ప్రధాని ప్రచారంతో కన్నడ రాజకీయ వాతావరణంలో మార్పు వచ్చిందని పేర్కొంది. సర్వే ఫలితాల ప్రకారం.. బాంబే కర్ణాటకలో బీజేపీ 23, కాంగ్రెస్‌ 21, జేడీఎస్‌ 4 స్థానాలు గెలుచుకోనుండగా.. కోస్తా కర్ణాటకలో బీజేపీ 9, కాంగ్రెస్‌ 10, జేడీఎస్‌ 2 చోట్ల గెలవనున్నాయి. గ్రేటర్‌ బెంగళూరులో బీజేపీ 13, కాంగ్రెస్‌ 18, జేడీఎస్‌ 1 స్థానంలో, మధ్య కర్ణాటకలో బీజేపీ 20, కాంగ్రెస్‌ 13, జేడీఎస్‌ 2 చోట్ల విజయం సాధించనున్నాయి. హైదరాబాద్‌ కర్ణాటకలో బీజేపీ 15 సీట్లు, కాంగ్రెస్‌ 14, జేడీఎస్‌ 2 చోట్ల గెలవనుండగా.. మైసూరు ప్రాంతంలో జేడీఎస్‌ 24, కాంగ్రెస్‌21 చోట్ల గెలవనుండగా.. బీజేపీకి 8 సీట్లు మాత్రమే దక్కుతాయని సర్వే వెల్లడించనుంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top