ముందస్తు ఎన్నికలు వస్తాయని ఏడాది క్రితమే చెప్పా! | I predicted Early Elections One Year Before, Renuka chowdhury | Sakshi
Sakshi News home page

Sep 10 2018 3:09 PM | Updated on Mar 18 2019 9:02 PM

I predicted Early Elections One Year Before, Renuka chowdhury - Sakshi

సాక్షి, ఖమ్మం : ముందుస్తు ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే సమాయత్తమై ఉందని, ఈ యుద్ధానికి తాము సిద్ధమని తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు రేణుకా చౌదరి అన్నారు. సరైన సమయంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు. కేసీఆర్‌ అభ్యర్థులను ప్రకటించడంతో ఆ పార్టీలో రోజుకోక వ్యవహారం వెలుగుచూస్తోందని అసమ్మతిని ఉద్దేశించి పేర్కొన్నారు. ప్రభుత్వం నడిపే అనుభవం తమకు ఉందన్నారు.

సంవత్సరం ముందే ముందస్తు ఎన్నికలు వస్తాయని తాను ఆన్‌ రికార్డు చెప్పానని ఆమె పేర్కొన్నారు. పొత్తులపై స్పందిస్తూ ప్రతిపక్ష పార్టీలతో మాట్లాడుతున్నామని, ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపడం, ప్రజలకు మేలు చేయడం లక్ష్యంగా పొత్తులు ఉంటాయని అన్నారు. టీడీపీ- కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకుంటాయని జరుగుతున్న ప్రచారంపై ప్రస్తావించగా ఆ ప్రచారం నిజమయ్యేవరకు తాను కామెంట్‌ చేయనని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తరఫున ప్రచారం, ఖమ్మం జిల్లా నుంచి అసెంబ్లీకి పోటీ చేయడం తదితర విషయాల్లో పార్టీ అధినాయకత్వం నిర్ణయం, ప్రజాభిప్రాయం ప్రకారం నడుచుకుంటానని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement