ఏపీ లోక్‌సభ ఎన్నికల్లో ‘సిత్రాలు’

Highest Majority In Andhra Pradesh Lok Sabha Elections - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయ​ దుందుభి మోగించింది. 25 స్థానాలగానూ 22 సీట్లు కైవసం చేసుకుని తిరుగులేని ఆధిక్యం సాధించింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులంతా భారీ మెజారిటీతో గెలిచారు. ఆరుగురు అభ్యర్థులు 2 లక్షలకు పైగా మెజారిటీతో విజయాలు దక్కించుకున్నారు. ఎనిమిది మంది లక్షకు పైగా మెజారిటీతో గెలుపొందారు. గుంటూరు టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్‌ అత్యల్ప మెజారిటీతో గట్టెక్కారు. (అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక, అతి స్వల్ప మెజారిటీలు వీరివే..)

అత్యధిక మెజారిటీ..
కడపలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వైఎస్‌ అవినాశ్‌రెడ్డి 380976 ఓట్ల భారీ తేడాతో టీడీపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డిపై విజయం సాధించారు.
రాజంపేటలో టీడీపీ అభ్యర్థి సత్యప్రభపై వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మిథున్‌రెడ్డి 268284 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
నంద్యాలలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పోచా బ్రహ్మనందరెడ్డి 250119 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి మంద్రా శివానందరెడ్డిపై గెలుపొందారు.
తిరుపతిలో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిపై వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బల్లిదుర్గాప్రసాద్‌ 228376 ఓట్ల ఆధిక్యం సాధించారు.
అరకులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గొడ్డేటి మాధవి 224089 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి కిశోర్‌ చంద్రదేవ్‌పై విజయం దక్కించుకున్నారు.
ఒంగోలులో టీడీపీ అభ్యర్థి శిద్దా రాఘవరావుపై వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి 214851 ఓట్ల తేడాతో గెలిచారు.

అత్యల్ప మెజారిటీ..
గుంటూరులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డిపై టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్‌ 4205 అతి స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు.
విశాఖపట్నంలో టీడీపీ అభ్యర్థి మాత్కుమిల్లి భరత్‌పై వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ 4414 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు.
శ్రీకాకుళంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌పై కె. రామ్మోహన్‌ నాయుడు 6653 ఓట్ల తేడాతో గెలిచారు.
విజయవాడలో టీడీపీ అభ్యర్థి కేశినేని నాని 8726 ఓట్లతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్‌పై విజయాన్ని దక్కించుకున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top