హరియాణాలో తదుపరి సర్కార్‌ మాదే.. | Haryana Assembly Polls 2019: Kumari Selja Says Congress will Form Government | Sakshi
Sakshi News home page

హరియాణాలో తదుపరి సర్కార్‌ మాదే..

Oct 24 2019 1:54 PM | Updated on Oct 24 2019 1:55 PM

Haryana Assembly Polls 2019: Kumari Selja Says Congress will Form Government   - Sakshi

హరియాణాలో తదుపరి ప్రభుత్వం తామే ఏర్పాటు చేస్తామని ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ కుమారి సెల్జా స్పష్టం చేశారు.

చండీగఢ్‌ : హరియాణాలో కాంగ్రెస్‌ పార్టీ తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర చీఫ్‌ కుమారి సెల్జా చెప్పారు. హరియాణా ప్రజలు విలక్షణ తీర్పు ఇచ్చారని, బీజేపీ వైఫల్యాలను వారు ఇక ఎంతమాత్రం సహించబోరనే సంకేతాలు పంపారని సెల్జా గురువారం ట్వీట్‌ చేశారు. కాంగ్రెస్‌ నాయకత్వంలో హరియాణా తిరిగి నూతన జవసత్వాలు అందుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. హరియాణాలో 90 అసెంబ్లీ స్ధానాలకు గాను బీజేపీ 37 స్ధానాల్లో, కాంగ్రెస్‌ 32 స్ధానాల్లో, ఇతరులు 21 స్ధానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 46 స్ధానాలకు బీజేపీ చాలా దూరంలో నిలవడంతో దుష్యంత్‌ చౌతాలా నేతృత్వంలోని జేజేపీ కింగ్‌ మేకర్‌గా నిలిచింది. ఆ పార్టీ మద్దతు కోసం కాంగ్రెస్‌, బీజేపీలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.

Advertisement
 
Advertisement
Advertisement