‘రాఫెల్‌’ కొనుగోళ్లలో రూ.40 వేల కోట్ల అవినీతి | Hanumantha rao commented over bjp | Sakshi
Sakshi News home page

‘రాఫెల్‌’ కొనుగోళ్లలో రూ.40 వేల కోట్ల అవినీతి

Published Sat, Jul 28 2018 1:45 AM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM

Hanumantha rao commented over bjp - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాఫెల్‌ యుద్ధ విమానా ల కొనుగోళ్లలో రూ.40 వేల కోట్ల అవినీతి జరిగిందని మాజీ ఎంపీ వి.హనుమంతరావు ఆరోపించారు. బీజేపీ కుంభకోణాల ప్రభుత్వమని, ఆ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న కేసీఆర్‌ సంగతి చూస్తామని హెచ్చరించారు.

శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడూతూ, బోఫోర్స్‌ కుంభకోణాన్ని బీజేపీ గోరంతది కొం డతగా చూపి రాజీవ్‌గాంధీని పార్లమెంట్‌లో అవమానించారని, ఆయన చనిపోయిన తర్వాత ఆ కుంభకోణంపై కోర్టు క్లీన్‌ చిట్‌ ఇచ్చిందని గుర్తుచేశారు. ఎలాంటి అనుభవం లేని అనిల్‌ అంబానీకి చెందిన కంపెనీకి రాఫెల్‌ యుద్ధ విమానాల కాంట్రాక్టు ఏలా ఇస్తారని ప్రశ్నించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement