బీసీ, ఎస్సీ, ఎస్టీలంటే కాంగ్రెస్‌కు చులకన! | guvvala balaraj on BC welfare | Sakshi
Sakshi News home page

బీసీ, ఎస్సీ, ఎస్టీలంటే కాంగ్రెస్‌కు చులకన!

Dec 5 2017 3:02 AM | Updated on Dec 5 2017 3:02 AM

guvvala balaraj on BC welfare - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీసీల సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని, 2017–18 రాష్ట్ర బడ్జెట్‌లో బీసీలకు రూ. 5వేల 70 కోట్లను కేటా యించామని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలంటే కాంగ్రెస్‌ నేతలకు చులకన భావన ఉందని విమర్శించారు. ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, అంజయ్య యాదవ్‌  విలేకరులతో మాట్లాడారు.

బీసీలను గతంలో కేవలం ఓటు బ్యాంకులుగానే పార్టీలు పరిగణించాయని, ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా కేసీఆర్‌ బీసీల సంక్షేమం గురించి ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. అచ్చంపేటలో కాంగ్రెస్‌   నిర్వహించింది ప్రజాగర్జన సభ కాదని, సీఎం అభ్యర్థుల అధికార యావ సభ అని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement