
‘‘గ్రామ వార్డు సభ్యుని స్థాయినుంచి ఈ స్థాయికి ఎదిగా. తాబేలులా చిన్నగా లక్ష్యం వైపు వెళుతున్నా. రాజకీయాల్లో మనం చేసిన పనులే శాశ్వతం. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, ఎన్టీఆర్‌లను జనం మరిచిపోలేదా? చేసిన పనులే గుర్తుంటాయి. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎం కావడంతో ప్రతీ ఎమ్మెల్యే సీఎం కావడం తేలిక అనుకుంటున్నారు. రేవంత్‌రెడ్డి వంటి కొందరు లీడర్లను మీడియా హైప్ చేస్తోంది.
దీంతో వాళ్ల స్థాయి ఏమిటో తెలియక ఎగిరెగిరి పడుతున్నారు. నాకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న ఆలోచన లేదు. టీఆర్‌ఎస్‌లో ఎలాంటి అసంతృప్తి లేదు. కాంగ్రెస్ వైపు చూస్తున్నాననడం తప్పు. రైతు సమన్వయ సమితి చైర్మన్ పదవి గురించి నాకేం తెలియదు. నేను అడిగిన పనులన్నీ సీఎం చేస్తున్నారు. నల్లగొండకు మెడికల్ కాలేజీ, డిండి ప్రాజెక్ట్ వంటి ఇతర పనులన్నీ చేస్తున్నారు’’.