టీడీపీ అభ్యర్థి బరితెగింపు.. తహశీల్దార్‌ ఆఫీస్‌లోనే..

Gurjala TDP Candidate Yarapathineni Srinivasa Rao Violates Election Code - Sakshi

సాక్షి, గుంటూరు : గురజాల టీడీపీ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఎన్నికల నిబంధనలను యథేచ్చగా ఉల్లంఘించారు. ప్రభుత్వ కార్యాలయాన్ని టీడీపీ ఆఫీసుగా మార్చేసుకున్నారు. ప్రచారంలో ఉపయోగించే ఆటోలకు పచ్చ జెండాలు, బ్యానర్లు కట్టడానికి ఏకంగా తహశీల్దారు ఆఫీసును అడ్డాగా చేసుకుని బరితెగించారు. నియోజకవర్గంలో ర్యాలీ చేపట్టేందుకు ఆటోలను పిడుగురాళ్ల తహశీల్దార్‌ కార్యాలయానికి రప్పించిన యరపతినేని అక్కడ నుంచే ర్యాలీ చేపట్టారు.

ఇక మొదటినుంచీ ఇసుక దోపిడీ, అక్రమ మైనింగ్‌తో వివాదాస్పద నేతగా పేరున్న యరపతినేని ఇటీవల మరోసారి వార్తల్లో నిలిచారు. గత బుధవారం దాచేపల్లి మండలం ఇరికేపల్లి ఎస్సీ కాలనీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ‘మేము అభివృద్ధి చేశాం.. కాలనీ వాసులు టీడీపీకి అనుకూలంగా ఉన్నప్పటికీ, కొంతమంది వ్యక్తులు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు.. నన్ను మరోవైపు చూడవద్దు.. నేను మంచికి మంచివాడిని.. తేడా వస్తే తాట తీస్తా’ అంటూ బెదిరించారు.  

(చదవండి : ఎమ్మెల్యే యరపతినేని వివాదాస్పద వ్యాఖ్యలు)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top