
రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు (ఫైల్ ఫొటో)
సాక్షి, న్యూఢిల్లీ : ఎట్టకేలకు ఫేస్‌బుక్ సమాచారం లీకేజీ కుంభకోణంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మౌనం వీడారు. ఉద్దేశ పూర్వకంగా ఈ అవాస్తవపు అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పైకి తీసుకొచ్చిందని అన్నారు. ఇరాక్‌లో 39మంది భారతీయులు ప్రాణాలుకోల్పోయారని, ఆ విషయంలో కేంద్రం వైఫల్యం ఉందని, దానిని న ఉంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ పార్టీపై అవాస్తవపు ఆరోపణలు బీజేపీ చేస్తుందంటూ ట్విటర్ ద్వారా తెలిపారు. గతంలో కంటే భిన్నంగా ఆయన ఆరోపణలు చేశారు.
'సమస్య : 39 మంది భారతీయులు చనిపోయారు. ప్రభుత్వం తెరమీదకు వచ్చి అబద్ధాలు ఆడుతూ దొరికిపోయింది. పరిష్కారం : కాంగ్రెస్‌పై సమాచారం దొంగిలింపు అని ఓ కొత్త కథను కనుగొంది. ఫలితం : మీడియాలో దీనిపై ఎప్పటిలాగే విస్తృత చర్చ.. 39మంది భారతీయులు రాడార్ నుంచి కనుమరుగు.. సమస్యకు పరిష్కారం.' అంటూ రాహుల్ వినూత్నంగా ట్వీట్ చేశారు. ఫేస్‌బుక్ డేటా లీకేజీపై రాహుల్ తొలి స్పందన ఇదే. 2019 ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కేంబ్రిడ్జి ఎనాలిటికా అనే సంస్థ సాయంతో కలిసి పనిచేస్తూ పలువురి వ్యక్తిగత డేటాను కొల్లగొట్టిందని బీజేపీ ఆరోపించగా ఎప్పుడూ అబద్ధాలు వండి వార్చే బీజేపీ మరో కొత్త అబద్ధాన్ని కథగా తెరపైకి తెచ్చిందంటూ కాంగ్రెస్ ప్రతిదాడి చేసింది. పైగా ఈ సంస్థతో బీజేపీ పలుసార్లు పనిచేయించుకుందని, 2014 ఎన్నికల్లో కూడా ఈ సంస్థను బీజేపీ వాడుకుందంటూ కాంగ్రెస్ ఆరోపించింది.
Problem: 39 Indians dead; Govt on the mat, caught lying.
— Rahul Gandhi (@RahulGandhi) March 22, 2018
Solution: Invent story on Congress & Data Theft.
Result: Media networks bite bait; 39 Indians vanish from radar.
Problem solved.