భట్టి విక్రమార్కతో గద్దర్ భేటీ | Gaddar Meets Bhatti Vikramarka | Sakshi
Sakshi News home page

Sep 29 2018 1:39 PM | Updated on Mar 18 2019 9:02 PM

Gaddar Meets Bhatti Vikramarka - Sakshi

సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లుతో ప్రజాగాయకుడు గద్దర్ శనివారం ఉదయం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. భట్టి విక్రమార్క నివాసానికి వచ్చిన గద్దర్.. ఆయనతో సుదీర్ఘ సమయంపాటు సమావేశం అయ్యారు.  పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో సామాన్య ప్రజల కోసం కవులు, కళాకారులు, గద్దర్ వంటి వారు కలిసిరావలని భట్టి విక్రమార్క ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కోసం ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అందరూ సహకరించాలని, ఏ ఆశయాలు, లక్ష్యాల కోసం రాష్ట్రాన్ని సాధించుకున్నామో వాటిని చేరుకునేందుకు ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాల్సిన ఆవశ్యకత ఉందని విక్రమార్క పేర్కొన్నారు. పొడుస్తున్న పొద్దుమీద కదులుతున్న కాలమా.. పోరు తెలంగాణమా... అన్న గీతంలోని లక్ష్యాలను చేరుకుందామని విక్రమార్క అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement