
తన కార్యాలయం ముందు బడ్జెట్ బ్రీఫ్ కేస్‌ను మీడియాకు చూపుతున్న అరున్ జైట్లీ
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్ 2018-19 నేపథ్యంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తన ఇంటి నుంచి బయలుదేరి ఆర్థికశాఖ కార్యాలయానికి చేరుకున్నారు. తనకు బడ్జెట్ రూపకల్పనలో సహకరించిన కేంద్రమంత్రులు, ఇతర అధికారులతో కలిసి ఆయన తన కార్యాలయం ముందు ఫొటోలకు పోజులిచ్చారు. ఈ సందర్భంగా తన చేతిలోని బ్రీఫ్ కేసును ఇది మీకోసం అన్నట్లు పైకెత్తి చూపారు. కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం లోక్‌సభలో 2018-19 ఏడాదికిగాను కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే.
ఏప్రిల్ 1, 2018 నుంచి ప్రారంభంకానున్న ఆర్థిక సంవత్సరానికి ఆయన గురువారం ఉదయం 11గంటలకు బడ్జెట్‌ను ప్రసంగ పాఠవాన్ని మొదలుపెట్టనున్నారు. 2019లో సాధారణ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈ బడ్జెట్ కేంద్రానికి అతిముఖ్యమైనది కాగా ఇదే ఏడాది ఎనిమిది రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ బడ్జెట్‌కు ప్రాధాన్యం సంతరించుకుంది. మరోపక్క, కేంద్రం జీఎస్‌టీని గత ఏడాది అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత వస్తున్న తొలి బడ్జెట్ కూడా ఇదే. ఈ నేపథ్యంలో సర్వాత్రా ఆసక్తి నెలకొంది.