ఓటర్ల తుది జాబితా రెడీ: రజత్‌కుమార్‌

Final voter list in Telangana to be ready by October 12 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభ రద్దయిన నేపథ్యంలో ముందస్తు ఎన్నికల నిర్వహణ కోసం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా రెండో సవరణ కార్యక్రమం దాదాపు పూర్తయిందని, తుది జాబి తా ప్రచురణకు సిద్ధంగా ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్‌కుమార్‌ తెలిపారు. హైకోర్టు అనుమతి లభించిన నేపథ్యంలో షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 12న ఓటర్ల తుది జాబితా ప్రచురిస్తామన్నారు. తొలిసారిగా ఈఆర్వో నెట్‌ వెబ్‌సైట్‌లో ఓటర్ల జాబితాను ప్రచురిస్తున్న నేపథ్యంలో పొరపాట్లు లేకుండా సరిచూసుకున్న తర్వాతే తుది జాబితా ప్రకటిస్తామన్నారు. ఎన్నికల ఏర్పాట్లపై బుధవారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఓటర్ల సవరణ కార్యక్రమం కింద మొత్తం 33,14,006 దరఖాస్తులు రాగా వాటిలో కొత్త ఓటర్ల నమోదు (ఫారం–6)కు 22,36,677, ఓట్ల తొలగింపు (ఫారం–7)నకు 7,72,939, వివరాల సవరణ (ఫారం–8, 8ఏ)కు 2,91,256 దరఖాస్తులు వచ్చాయన్నారు. వచ్చిన దరఖాస్తుల్లో 30,00,872ను ఆమోదించగా, 3,12,335 దరఖాస్తులను తిరస్కరించామన్నా రు. 799 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top