ఎన్నికల పరిశీలకులుగా ఐఏఎస్ అధికారులు

Election Commission Appointed IAS Officers As Election Observers - Sakshi

సాక్షి, విజయవాడ : ఎన్నికల సమయంలో ఎటువంటి వివాదాలకు తావు లేకుండా ఎన్నికలు నిర్వహించేందుకు ఐఏఎస్‌ అధికారులను ఎన్నికల పరిశీలకులుగా నియమించామని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎ.ఎండి.ఇంతియాజ్ తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులను నేరుగా ఐఏఎస్‌ అధికారులకు తెలియజేయవచ్చని చెప్పారు. విజయవాడలోని ఏపీటీడీసీకి చెందిన హరిత హోటల్‌లో ఐఏఎస్‌ అధికారులకు బస ఏర్పాటు చేశామన్నారు. ఫిర్యాదులు ఉంటే ప్రతి రోజు ఉదయం 10గంటల నుంచి 11 గంటల వరకు అధికారులను నేరుగా కలవవచ్చన్నారు. లేని పక్షంలో వారి వారి సెల్‌ఫోన్‌లకు కాల్‌ చేసి ఫిర్యాదు తెలియజేయవచ్చని పేర్కొన్నారు. 

వివిధ నియోజక వర్గాల ఎన్నికల పరిశీలకుల పేర్లు, వారి ఫోన్‌ నంబర‍్ల వివరాలు

  • మచిలీపట్నం పార్లమెంట్- గణేష్ కుమార్- జె.సి.ఛాంబర్, బందరు- 6300606742.
  • విజయవాడ- పార్లమెంట్-పి.జవహర్- హరితహోటల్-రూమ్ నంబర్ 202- 9847794220.
  • మైలవరం, నందిగామ, జగయ్యపేట- భన్వర్ సింగ్ సంధూ- హరితహోటల్ రూమ్ నంబర్ 201- 9676969337.
  • తిరువూరు, విజయవాడ పశ్చిమ, విజయవాడ మధ్య, విజయవాడ తూర్పు- పి. శ్రీవెంగడ ప్రియ- హరితహోటల్ రూమ్ నెంబర్ 204- 9347072208.
  • .నూజివీడు, కైకలూరు- జయకృష్ణన్అభిర్-హరితహోటల్ రూమ్ నంబర్ 304- 7032167986
  • గన్నవరం, గుడివాడ, పెడన, మచిలీపట్నం- రాజేష్ కుమార్ పాండే- హరితహోటల్ నంబర్ 303-9491123246.
  • .పెనమలూరు, పామర్రు, అవినిగడ్డ- హరితహోటల్ రూమ్ నంబర్ 101- 9347066714.
Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top