'పర్యావరణం కాపాడేవారైతే అక్కడెందుకున్నారు'

Dwarampudi Chandrashekar Fires On Chandrababu In Kakinada - Sakshi

సాక్షి, కాకినాడ : చంద్రబాబు లాంటి వ్యక్తి రాష్ట్రంలో పుట్టడం దౌర్బాగ్యమని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ధ్వజమెత్తారు. బాబు పర్యావరణాన్ని కాపాడే వ్యక్తే అయితే కష్ణానది కరకట్టపై ఇన్నాళ్లు ఎందుకు నివాసం ఉన్నారో చెప్పాలంటూ ప్రశ్నించారు. కాకినాడలో పేదలకు ఇళ్ళ స్ధలాలు ఇవ్వకుండా టీడీపీ అడ్డుకుంటుందన్నారు. ఇండ్ల స్ధలాల కోసం సేకరించిన పోర్టు భూములను అడవులని సాకుగా చూపించి టీడీపీ నేతలు న్యాయస్ధానాలను ఆశ్రయిస్తున్నారని విమర్శించారు. కానీ ఆ భూముల్లో మడ అడవులు లేవని అటవీ శాఖ పేర్కొన్నట్లు గుర్తు చేశారు. ఇక్కడ మత్స్య సంపద పుట్టదని మత్స్య శాఖ కూడా స్పష్టంగా తేల్చి చెప్పిందన్నారు. 
(ఏపీలో 2205కు చేరిన కరోనా కేసులు)

టీడీపీ బృందం శుక్రవారం పోర్టు భూముల్లో పర్యటించుంటే భూ లబ్ధిదారులు తగిన విధంగా వారికి సమాధానం చెప్పేవారని పేర్కొన్నారు. చినరాజప్ప మంత్రిగా ఉన్నప్పుడు పెద్దాపురంలో కొండల్ని తవ్వేశారు.. అప్పుడు పర్యావణం గుర్తుకు రాలేదా? అంటూ ప్రశ్నించారు. ఇండ్ల స్దలాల లబ్ధిదారులతో మాట్లాడి వారిని తాను ఒప్పిస్తానని టీడీపీ బృందంలో ఎవరు వస్తారో చెబితే వారిని తానే దగ్గరుండి పోర్టు భూములను చూపిస్తానంటూ ద్వారంపూడి తెలిపారు. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత టీడీపీ తీరుపై లబ్ధిదారులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top