పవన్‌ కల్యాణ్‌కు ద్వారంపూడి బహిరంగ లేఖ | Dwarampudi Chandrasekhar Reddy Writes Open Letter To Pawan Kalyan | Sakshi
Sakshi News home page

Oct 22 2018 2:00 PM | Updated on Mar 22 2019 5:33 PM

Dwarampudi Chandrasekhar Reddy Writes Open Letter To Pawan Kalyan - Sakshi

సాక్షి, కాకినాడ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కాకినాడ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నాయకుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సోమవారం బహిరంగ లేఖ రాశారు. జనసేన కవాతు సందర్భంగా ఇటీవల ధవళేశ్వరంలో జరిగిన సభలో పవన్ తనపై చేసిన ఆరోపణలను ఆయన ఈ లేఖలో ఖండించారు. తాను కొనుగోలు చేసిన స్థలం విషయంలో వాస్తవాలేమిటో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌ను అడిగితే తెలుస్తోందని తెలిపారు.

2014 ఎన్నికల సమయంలోనూ పవన్ ఇవే ఆరోపణలు తనపై చేశారని గుర్తుచేశారు. నిర్దిష్టమైన ఆధారాలు లేకుండా తనపై విమర్శలు చేయడం ఆయనకు తగదని హితవు పలికారు. నాయకుడు అనేవాడు వాస్తవాలు తెలుసుకొని.. పూర్తి సమాచారాన్ని ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకున్న తరువాతే మాట్లాడాలని సూచించారు. ‘గత ఎన్నికల్లో మీరు ప్రచారం చేసి గెలిపించిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు అవినీతిపై ప్రజాపోరాటయాత్రలో మీరు మాట్లాడాలి’ అని పవన్‌కు ద్వారంపుడి సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement