అంబేద్కర్ ఆశయాలు జగన్ వల్లే సాధ్యం : వెల్లంపల్లి 

DR BR Ambedkar Death Anniversary YSRCP Leaders Comments - Sakshi

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రాజ్యాంగం అపహాస్యం అయ్యిందని వైఎస్సార్‌ సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున వ్యాఖ్యానించారు. గురువారం డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ వర్థంతి సందర్భంగా వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ నేతలు పార్థసారధి, మేరుగ నాగార్జున, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్‌, యలమంచిలి రవి, క్రిస్టియాన, నందిగామ సురేష్‌, కాలే పుల్లారావు, ఆసీఫ్‌, డాక్టర్‌ మెహబూబ్‌ షేక్‌, బేగ్‌లు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. అంబేద్కర్‌ ఆశయ సాధనకు అందరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. 

‘ఆయన నాయకత్వంలో రాజ్యాంగ పవిత్రతను కాపాడుతాం’
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నాయకత్వంలో రాజ్యాంగ పవిత్రతను కాపాడుతామని వైఎస్సార్‌ సీపీ నేత పార్థసారధి అన్నారు. గురువారం డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ వర్థంతి సందర్భంగా ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్థసారధి మాట్లాడుతూ.. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలు మర్చిపోయాయని, ప్రజలే కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఫిరాయింపులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి : మల్లాది విష్ణు
రాజ్యాంగ బద్ధ పదవుల్లో ఉన్న వారు ఫిరాయింపులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌ సీపీ నేత మల్లాది విష్ణు మరోసారి విజ్ఞప్తి చేశారు. గురువారం డాక్టర్‌ బి. ఆర్‌ అంబేద్కర్‌ వర్థంతి సందర్భంగా ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మల్లాది మాట్లాడుతూ.. రాజ్యాంగ ఉల్లంఘనపై తమ పార్టీ ఎప్పుడూ చెప్తూనే ఉందని, నిన్న ఉప రాష్ట్రపతి కూడా ఇదే చెప్పారని అన్నారు. 

అంబేద్కర్ ఆశయాలు జగన్ వల్లే సాధ్యం : వెల్లంపల్లి 
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వల్లే అంబేద్కర్ ఆశయాలు సాధ్యమని వైఎస్సార్‌ సీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. గురువారం డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ వర్థంతి సందర్భంగా ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ.. రాజ్యాంగానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top