అందని ఆహ్వానం.. డిప్యూటీ సీఎం కేఈ అసంతృప్తి!

Deputy CM KE KrishnaMurthy Disappointed with TTD - Sakshi

సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారుల తీరుపై ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజధాని అమరావతిలో టీటీడీ వారి ఆలయ భూకర్షణ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం కేఈకి ఆహ్వానం అందలేదు. దేవాదాయశాఖ అధికారులు కూడా ఆయనకు ఈ కార్యక్రమం గురించి సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది.

రాజధాని ప్రాంతంలోని తుళ్ళూరు మండలం  వెంకటపాలెంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి నూతన ఆలయ నిర్మాణానికి భూఆకర్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, టీటీడీ అధికారులు హాజరయ్యారు. ఏడు ఎకరాల్లో రూ. 150 కోట్లతో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని టీటీడీ ఇక్కడ నిర్మించనుంది. అయితే, పెద్ద ఎత్తున జరిగిన ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించకపోవడం, కనీసం సమాచారం ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనైన కేఈ ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top