న్యూఢిల్లీలో కేజ్రీవాల్‌ విజయం

Delhi Election Result 2020: Arvind Kejriwal Wins By Over 13508 Votes - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ భారీ విజయం దిశగా దూసుకుపోతోంది .సాధారణ మెజార్టీకి అవసరమైన స్థానాల్లో ఆప్‌ ఆధిక్యంలో ఉంది.  ఇప్పటి వరకు వెలువడి ఫలితాల ప్రకారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ఆప్‌ 18 స్థానాల్లో విజయం సాధించి, 40 స్థానాల్లో ముందంజలో ఉంది. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ భారీ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థిపై 13,508 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు. శీలంపూర్‌లో ఆప్‌ అభ్యర్థి అబ్దుల్‌ రెహమాన్‌ విజయం సాధించారు. సంగంవిహార్‌, దేవ్‌లీలో ఆప్‌ అభ్యర్థులు మెహనియా, ప్రకాష్‌లు విజయం సాధించారు. ఇక ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా 1288 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. ముస్తఫాబాద్‌లో బీజేపీ అభ్యర్థి జగదీష్‌ ప్రధాన్‌ విజయం సాధించారు. కల్కాజీలో ఆప్‌ అభ్యర్థి 2070 ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top