
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏం జరుగుతోందన్న దానిపై ప్రజలు వాస్తవం గ్రహిస్తే కేసీఆర్, ఆ పార్టీ నేతలు ప్రజల ఆగ్రహానికి మిడతల్లా మాడిపోతారని టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ మండిపడ్డారు. ఈ మేరకు శనివారం సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసినవి రైతు సమన్వయ సమితులు కావని, రాజకీయ సమన్వయ సమితులని పేర్కొన్నారు. అసమర్థతతో రైతులకు మద్దతు కల్పించకుండా ఆ నెపాన్ని కేంద్రంపై నెట్టి గ్రామాల్లో పార్టీని బలోపేతం చేసుకునేందుకు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని లేఖలో ఆరోపించారు. రైతు సమస్యలు, ఆత్మహత్యల గురించి మాట్లాడకుండా జాతీయ రాజకీయాలు తెరమీదకి తెచ్చి హంగామా చేయడం మీకు అలవాటని కేసీఆర్‌ను ఎద్దేవా చేశారు.