
సాక్షి, హైదరాబాద్: భూ కబ్జాలకు తాను పాల్పడినట్టుగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానని టీఆర్‌ఎస్ నేత దానం నాగేందర్ అన్నారు. తనపై ఆరోపణలు మానుకోవాలని హెచ్చరించారు.
మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఉత్తమ్‌కు గాంధీభవన్‌లో ఏ గౌరవమూ లేదని, ఢిల్లీలో డబ్బులిచ్చి పదవిని కాపాడుకుంటున్నారన్నారు. నోటికొచ్చినట్టు మాట్లాడితే కోర్టుకు లాగుతానని హెచ్చరించారు. డబ్బులకు అమ్ముడుపోయినట్టుగా తనపై వ్యాఖ్యలు చేసిన ఉత్తమ్ కారులోనే డబ్బులు దొరికాయని.. అప్పుడు ఎవరికి అమ్ముడుపోయి డబ్బులు తెచ్చారో చెప్పాలన్నారు.