
పాతమంచిర్యాల: దేశ ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేయడానికి వస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ప్రధాని మోదీ పూజిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. మంచిర్యాలలో నిర్వహించిన పార్టీ రాష్ట్ర నిర్మాణ మహాసభకు హాజరయ్యారు. ట్రంప్ దేశ పర్యటను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ట్రంప్ పర్యటనతో దేశంలో నిరసనలు కొనసాగుతున్నాయని, తీవ్ర నిర్బంధకాండ మధ్య ట్రంప్ పర్యటన సాగుతోందని ఎద్దేవా చేశారు.