గతమెంతో ఘనం...నేడు ఉనికే ప్రశ్నార్థకం

CPI hard working for existence - Sakshi

ఉనికి కోసం పాట్లు పడుతున్న సీపీఐ

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుత ఎన్నికల్లో కనీసం ఒక్క సీటైనా గెలిచి అసెంబ్లీలో కనీస ప్రాతినిధ్యం సాధించేందుకు సీపీఐ ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్‌ ప్రజా ఫ్రంట్‌ కూటమిలో భాగంగా మూడు స్థానాల్లో పోటీచేస్తున్న సీపీఐ ఉనికి చాటుకునే ప్రయత్నాల్లో నిమగ్నమైంది. కాంగ్రెస్‌ ప్రజాఫ్రంట్‌ కూటమిలోకి టీడీపీ, టీజేఎస్, సీపీఐ చేరినా సీట్ల సర్దుబాటు సజావుగా జరగలేదు. దాదాపు 10 నుంచి 12 స్థానాలు కోరుకుని వాటిలో కనీసం ఐదైనా లభిస్తాయనుకుంటే, కూటమి సమీకరణల్లో సీపీఐకు మూడుసీట్లే లభించాయి. దీంతో గతమెంతో ఘనంగా ఉన్న సీపీఐ ఇప్పుడు ఉనికికోసం పాట్లు పడుతోంది.  

హుస్నాబాద్‌: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఇక్కడి నుంచి పోటీచేశారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో సీపీఐ సీట్ల సర్దుబాటులో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. 2009లో టీడీపీ, టీఆర్‌ఎస్, లెఫ్ట్‌ పొత్తులో పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో పోటీ చేయలేదు. ప్రస్తుతం ఇక్కడ టీఆర్‌ఎస్‌–సీపీఐ–బీజేపీల ముక్కోణపు పోటీ జరిగింది.  

బెల్లంపల్లి (ఎస్సీ): ఇక్కడ ప్రధానపార్టీల మధ్య చతుర్ముఖæ పోటీ నెలకొంది. టీఆర్‌ఎస్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, కాంగ్రెస్‌ కూటమిలోని సీపీఐ అభ్యర్థి గుండామల్లేశ్, బీజేపీ నుంచి కొయ్యల ఏమాజీ, ఎంసీపీఐ నుంచి సబ్బని కృష్ణ పోటీ చేశారు. మాజీమంత్రి జి. వినోద్‌ ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించి దక్కకపోవడంతో బీఎస్‌పీ టికెట్‌పై బరిలో ఉన్నారు.  

వైరా(ఎస్టీ): ఇక్కడి నుంచి గతంలో సీపీఐ గెలుపొందింది. అంతకుముందు పార్టీలో సభ్యత్వం కూడా లేని విజయాబాయికి ఈసారి ఇక్కడినుంచి సీపీఐ టికెట్‌ లభించింది. టీఆర్‌ఎస్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే బానోతు మదన్‌లాల్‌ (గత ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ టికెట్‌పై గెలిచారు), బీజేపీ నుంచి రేష్మా రాథోడ్, సీపీఎం నుంచి భుక్యా వీరభద్రరావు పోటీచేస్తున్నారు. కాంగ్రెస్‌ టికెట్‌ను ఆశించి భంగపడ్డ రాములునాయక్‌ తిరుగుబాటు అభ్యర్థిగా ఇక్కడ బరిలో ఉన్నారు. సీపీఎం అభ్యర్థి కూడా పోటీలో ఉండటం వల్ల ఓట్లు చీలిపోయే అవకాశాలతో పాటు కాంగ్రెస్‌–సీపీఐల మధ్య ఓట్ల బదిలీ ప్రశ్నార్థకంగా మారింది.

1983 నుంచి ఎత్తుపల్లాలు
టీడీపీ ఆవిర్భావం తర్వాత 1983 ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టుపార్టీల్లో ఒకటైన సీపీఐ ఎన్నో ఎత్తుపల్లాలు ఎదుర్కొంది. 1983 ఎన్నికల్లో 48 స్థానాల్లో పోటీచేసిన సీపీఐ 4 స్థానాల్లోనే గెలిచింది. 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో సీపీఐ, సీపీఎంలు చెరో 11 స్థానాలు దక్కించుకోగా 1989లో జరిగిన ఎన్నికల్లో సీపీఐ 5 సీట్లలో గెలుపొందింది. 1994 ఎన్నికల్లో టీడీపీ పొత్తుతో సీపీఐ 19 సీట్లు గెలుచుకుంది. 1999 ఎన్నికల్లో సీపీఐ ఒక్కసీటుకూడా గెలుచుకోలేక పోయింది. మళ్లీ 2004లో కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటు చేసుకుని పోటీచేసినపుడు సీపీఐ 6 స్థానాల్లో గెలుపొందింది. 2009 ఎన్నికల్లో సీపీఐ 4 స్థానాలు, తెలంగాణ ఏర్పడ్డాక 2014లో జరిగిన ఎన్నికల్లో ఒక్క స్థానానికే పరిమితమైంది.

మరిన్ని వార్తలు

14-12-2018
Dec 14, 2018, 17:38 IST
వరంగల్‌: తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమించబడ్డ కేటీఆర్‌కు మాజీ మంత్రి కడియం శ్రీహరి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ...
14-12-2018
Dec 14, 2018, 15:41 IST
సాక్షి, కరీంనగర్‌ : కాంగ్రెస్ అధికార ప్రతినిధి గజ్జెల కాంతం టీపీసీసీ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. దేశ...
14-12-2018
Dec 14, 2018, 12:22 IST
రాష్ట్ర శాసనసభ ముందస్తు ఎన్నికల ఫలితాలు వెలువడి మూడు రోజులు కావస్తున్నా, కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో ఓటమిపై అంతర్మథనం కొనసాగుతోంది....
14-12-2018
Dec 14, 2018, 12:03 IST
సుదీర్ఘ రాజకీయ అనుభవం... పోల్‌ మేనేజ్‌మెంట్‌లో దిట్ట... ఎన్నికలకు ముందు అందివచ్చిన అధికారం... నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి... కేసీఆర్‌ చరిష్మా.....
14-12-2018
Dec 14, 2018, 11:41 IST
అడుగడుగునా అవాంతరాలు.. ఆరంభంలోనే ఉపాధ్యాయుల బదిలీలు.. అసెంబ్లీ ఎన్నికలు.. తిరిగి పంచాయతీ ఎన్నికల కోసం ప్రారంభమైన సన్నాహాలు.. ఆపై ముంచుకొస్తున్న...
14-12-2018
Dec 14, 2018, 11:24 IST
రాజకీయ పరిశీలకుల అంచనాలను తలకిందులు చేసి అఖండ విజయం నమోదు చేసిన టీఆర్‌ఎస్‌ పార్టీ విజయం వెనుక జిల్లా మహిళల...
14-12-2018
Dec 14, 2018, 10:57 IST
మంచిర్యాలటౌన్‌: ఎన్నికల్లో తమకు నచ్చిన అభ్యర్థులను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకునేందుకు ఓటు ఆయుధమైతే.. అభ్యర్థుల్లో ఎవరూ నచ్చలేదని తమ అభిప్రాయాన్ని వ్యక్తపర్చేందుకు...
14-12-2018
Dec 14, 2018, 10:26 IST
సాక్షి, సిటీబ్యూరో: విద్యావంతులు.. సామాజిక చైతన్యం మెండుగా ఉన్న రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్‌ జిల్లాలో లక్షల మంది పోలింగ్‌పై...
14-12-2018
Dec 14, 2018, 05:17 IST
సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి త్వరగా కోలుకునేందుకు తెలంగాణ జన సమితి ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని...
14-12-2018
Dec 14, 2018, 05:04 IST
సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నిర్వహించిన ప్రచారం ప్రజా కూటమిపై ప్రతికూల ప్రభావం చూపిందని సీపీఎం...
14-12-2018
Dec 14, 2018, 04:55 IST
సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఘనవిజయం సాధిస్తుందని ఆ పార్టీ అధినేత...
14-12-2018
Dec 14, 2018, 04:45 IST
సాక్షి, హైదరాబాద్‌: రాజకీయాల్లో సెంటిమెంట్లకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఫలానా గుడికి వెళితే.. పదవి మటాష్‌ అన్న ప్రచారం ఉంటే.....
14-12-2018
Dec 14, 2018, 02:56 IST
‘కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని భారతదేశ...
14-12-2018
Dec 14, 2018, 02:35 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 88 సీట్లలో ఘన విజయం సాధించినప్పటికీ 26 నియోజకవర్గాల్లో మాత్రం ‘కారు’జోరుకు...
14-12-2018
Dec 14, 2018, 02:30 IST
తెలంగాణలో ఈసారి ఎవరికి కేబినెట్‌ బెర్తులు దక్కుతాయనేదానేదే ఆసక్తికరంగా మారింది.
14-12-2018
Dec 14, 2018, 02:21 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర హోం మంత్రిగా మహమూద్‌ అలీని నియమిస్తూ సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. గురువారం మధ్యాహ్నం...
13-12-2018
Dec 13, 2018, 19:02 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాతీర్పు గౌరవిస్తానని రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అయితే,...
13-12-2018
Dec 13, 2018, 17:25 IST
సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌పై తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో జరిగిన తాజా ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్‌...
13-12-2018
Dec 13, 2018, 13:34 IST
కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు  రెండోసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కేసీఆర్‌తో పాటు..
13-12-2018
Dec 13, 2018, 10:40 IST
సాక్షి, సిటీబ్యూరో:  సిటీలో కారు జోరుమీద పరుగులు పెట్టింది. ఇక్కడ నివసిస్తున్న విభిన్న వర్గాలు ప్రజలూ కేసీఆర్‌కే జైకొట్టారు. సీమాంధ్రుల...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top