
బెంగళూరు : ప్రధాని నరేంద్ర మోదీ పిల్లల్ని కనలేని అసమర్థుడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే. వివరాలు.. బసవకళ్యాణి నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే నారాయణ రావు ఓ బహిరంగ సభలో మోదీని ఉద్దేశిస్తూ పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మోదీ అసమర్థుడు. ఇలాంటి వాడిని మా భాషలో ‘నమర్ద్’ అంటారు. అంటే పెళ్లి చేసుకోగలడు.. కానీ పిల్లల్ని కనలేడు. మోదీ కూడా అంతే.. వివాహం చేసుకోగలడు.. కానీ పిల్లల్ని కనలేడు. మోదీ చేతల ప్రధాని కాదు.. అబద్దాల ప్రధాని’ అంటూ తీవ్ర స్థాయి వ్యాఖ్యలు చేశారు.
గతంలో తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి మోదీని టెర్రరిస్ట్ అని విమర్శించిన సంగతి తెలిసింది. ఇదే సభలో రాహుల్ కూడా మోదీపై విమర్శలు చేశారు. ఈ ప్రధాని రెండు ఇండియాలను తయారు చేస్తాడని.. ఒకటి పేదల కోసం.. మరోటి ధనికుల కోసమంటూ ఆరోపించారు.